s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

కర్మ - ప్రారబ్దం..ఈ రెంటికి తేడా ఏమిటి? అనుభవిస్తేనే కాని కర్మలు నశించవా? లేక ఏదైనా మార్గం ఉందా? work duties


కర్మలు మనం నిత్యం చేసేవి. వీటివలన కలిగే ఫలితాలు కూడా వెంటనే ఉంటాయి. లేదా ఈ జన్మలో ఎదో ఒక సమయంలో చేసిన కర్మకి ఫలితం అనుభవించేలా చేస్తాయి.





ప్రారబ్దం అంటే..
ప్రారబ్దం అంటే! పూర్వజన్మ కర్మఫలాలు. ఉన్నట్లుండి ఆస్తులు పోవడం, లేదా ఉన్నట్లుండి రాత్రికి రాత్రే ఎదగడం, ప్రమాదవశాత్తు మరణించడం దీనినే అపమృత్యువు అంటారు. దీర్ఘకాలిక రోగాలు అనుభవించడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, వివాహం కాకపోవడం, ఇలా జీవితాలకి సంబంధించిన ముఖ్య ఘట్టాలలో సమస్యలు రావడమే ప్రారబ్దం అంటారు. ఇలాంటివి అన్నీ అనుభవిస్తేనే కాని తీరవు.





బ్రాహ్మణ హత్య, గోహత్య, స్త్రీహింస, పెద్దలను అగౌరవపరచడం,  గురుదూషణ, ఆభరణాలు, మణులు, మాణిక్యాలు, బంగారం దొంగతనం చేయడం, జీవహింస అంటే అవసరలేని సమయంలో జీవహింస చేయడం.. ఉదాహరణకి ఉత్తి పుణ్యానికి ఇతరులను కొట్టడం, తిట్టడం, అనవసరంగా చీమల్ని చంపడం, పక్షులని, జంతువులని చంపడం. (పూర్వం మాంసాహారం ఎప్పుడైనా ఒకసారి మాత్రమే తినేవారు.




అదికూడా పండగలకి, ఇంటికి బంధువులు వచ్చినప్పుడో ఇలాంటి ముఖ్యమైన వేళల్లో మాత్రమే మాంసాహారం తినేవారు. అదికూడా శుద్ధి చేసుకొని తినేవారు. ఈరోజున పరిస్థితి ఎలా ఉందొ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు తింటున్నారో! ఎందుకు తింటున్నారో కూడా తెలీదు. కంటికి కనబడినా, తినాలని మనస్సులో ఆలోచన వచ్చినా ఎగబడి తినేయడమే తప్ప ముందు వెనుక ఆలోచించే పనేలేదు. అనవసరపు జీవహింస మహాపాపం. మాంసాహారం తినేవారు ఎప్పుడూ ఉన్నారు.





 కాకపోతే అడ్డగోలుగా అదేపనిగా ఎప్పుడుపడితే అప్పుడు తినేవారు కాదు. దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. ఆదివారం అసలు మంసహరమే తినకూడదు. కాని ఆదివారం వస్తే చాలు ఈ చివరి నుండి ఆ చివరి వరకు తండోప తండాలుగా మాంసం అమ్మే కొట్ల దగ్గర జనం శవంలో పురుగుల్లా లుకలుక లాడిపోతున్నారు. దీనికంటే అసహ్యమైన పని మరొకటి ఉందా! శాస్త్రాలు అనుసరిస్తాం అని చెప్పే మీరే ఇలా శవంలో పురుగుల్లా, జంతువుల్లా (జంతువులే నయం ఆకలి వేసినప్పుడే వేటడతాయి, పైగా జంతు న్యాయం ఒకటి ఉంది వాటికి. మనిషికే లేదు.) జంతువుకంటే హీనంగా మారిపోతున్నారు.)







చెట్లు కొట్టడం ఒక పాపం. పూర్వం ఎండిపోయిన చెట్లు మాత్రమే కొట్టేవారు. ఇప్పుడు చెట్లు కనబడడం పాపం అయిపొయింది. నరకందే నిద్రపోవడంలేదు. ఒక చెట్టు కొట్టాలంటే దానిని పూజించి దానికి బదులుగా మూడు చెట్లు నాటించాలి. అప్పుడు మాత్రమే చెట్లు కొట్టే అవకాసం ఉంది. ఇలాంటి ముఖ్యమైనవి అన్నీ ప్రారబ్ద కర్మలు.. ఇవి వంశాల వారీగా వెంటపడతాయి. నిన్ను, నీ వంశాన్ని సర్వభ్రష్టం చేస్తాయి. 1+3 ఆఫర్ అన్నట్లు తయారవుతుంది బ్రతుకు. నువ్వు చేసే ఒక తప్పు ఇక్కడ ఇహ లోకంలో, అక్కడ పరలోకంలో, ఎప్పుడో జన్మ ఎత్తితే ఆ జన్మలో మూడు చోట్ల అనుభవించాలి.







ఇక కర్మలు..
నువ్వు ఎదగడం కోసం ఇతరులని నాశనం చేయాలని చూడడం, దూషించడం, మోసం చేయడం, పిసినారితనం, కోపం, స్వార్థం, అహంకారం, ప్రల్లదనాలు పలకడం (అది చేస్తాను, ఇది చేస్తాను అని గొప్పలు చెప్పుకోవడం, ఎదుటివారిని కించపరచి నిన్ను నువ్వే గొప్పగా చేసుకొని మాట్లాడడం) ఇవి ఒకస్థాయి వరకు బాగానే ఉన్నా స్థాయి దాటితే ప్రారబ్దం క్రిందకి మారిపోతాయి. అడిగి తన్నించుకోవడం అంటారు. లేదా గోటితో పోయేదానిని గోడ్డలివరకు తెచ్చుకోవడం అంటారు.






ఒక స్థాయివరకు చేస్తే ఈ జన్మలో అనుభావించేస్తావు.స్థాయి దాటితే ఆరోగ్యం ఇచ్చే మాత్ర అయినా విషమై చంపేస్తుంది. అలాగే కర్మలు కూడా స్థాయి దాటితే ప్రారబ్దంలోకి మారిపోతాయి. అప్పుడు ఎన్నో జన్మలు ఎత్తి ఆ ప్రారబ్ద కర్మలు అనుభవించి అదికూడా ఆయా జన్మలలో ఇలాంటి పనులు చేయకుండా ఉంటేనే తీరతాయి. లేదా అవి ఇవి అన్నీ వెంటాడి వేటాడి వేధించి ఎప్పటికో గాని జ్ఞానోదయం కలగదు.






కనుక పైన చెప్పిన పనులు వీలైనంత వరకు అదుపులో పెట్టుకొని ప్రారబ్ద కర్మలు అనుభవిస్తూ వీలైనంత పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేయండి. బ్యాంక్ లో డబ్బులు వేయకుండా డ్రా చేసుకోవాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో పుణ్య కర్మలు ఆచరించకుండా సుఖపడాలి అనుకోవడం అంతకంటే మూర్ఖత్వం..

వీటన్నిటికీ మార్గం ఉందా?






ఉంది. ప్రతి పనికి ఫలితం ఉన్నట్లే చేసే ప్రతి తప్పుకి కూడా నివారణ మార్గం ఉంది. కొన్ని జపం ద్వారా, కొన్ని తపస్సు ద్వారా, కొన్ని గురు సేవ ద్వారా (గురువు అంటే పెద్దలు, తల్లి దండ్రులు, ఉపాద్యాయులు, గురువులు), మరికొన్ని యజ్ఞాల ద్వారా, మరికొన్ని పూజల ద్వారా తొలగుతాయి. ఇవి గురువులని అడిగి తెలుసుకొని ఎం చేస్తే మంచిదో అది చేస్తే ఫలితం వస్తుంది. వచ్చి తీరుతుంది. సందేహంలేదు.. అలాగని తప్పులు చేస్తూ వెళ్తే ఒకటికి మూడు కాదు 10 వెంటాడతాయి. వీటన్నికంటే తగిన జాగ్రత్తలో ఉండడమే ఉత్తమం..

No comments:

Post a Comment