s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ……… ఈ ఐదింటినీ తినకుండా ఉండండి anti cancer food

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ………… ఏం చేయాలంటే……..
క్యాన్సర్ – ప్రపంచాన్ని వణికిస్తూ………. అనుక్షణం సవాల్ విసురుతున్న మహమ్మారి.
మారిన జీవనశైలి కొన్ని రకాల క్యాన్సర్లను కూడా ప్రేరేపిస్తుందనడం ఖచ్చితమైన వాస్తవం. అందుకే మన అలవాట్లు, ఆహార విధానాలు మార్చుకుంటే క్యాన్సర్ రాకుండా కొంతవరకు నివారించవచ్చు.




అందుకే మీరు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే
ఈ అయిదు రకాల పదార్థాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.


1. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ::
అందమైన కవర్లలో ప్యాక్ చేసి ఆకర్షణీయంగా కనిపించే రెడీమేడ్ ఆహార పదార్థాలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిలో కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారు చేసిన ఫ్లేవర్లు, ఉప్పు, చక్కెర, కృత్రిమ చక్కెర పదార్థాల లాంటివి ఎన్నో కలుపుతారు.
ఉప్పు ఎక్కువగా ఉన్నవి, ఊరేసినవి, నిలవ చేసిన పదార్థాల వల్ల జీర్ణకోశ క్యాన్సర్ అవకాశాలు పెరుగుతాయి. కేవలం ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలే జీర్ణకోశ క్యాన్సర్ అవకాశాన్ని 10 శాతం పెంచుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. కృత్రిమ రంగులు, అడిటివ్స్ కూడా హానికరమేనని తేలింది.



2. రెడ్‌మీట్, ప్రాసెస్ చేసిన మాంస ఉత్పత్తులు ::
రెడ్‌మీట్ ఎక్కువగా తినేవారిలో పెద్దపేగు, జీర్ణకోశ క్యాన్సర్ల అవకాశం ఎక్కువ. ప్రాసెస్ చేసి రెడీ టు ఈట్ గా తయారుచేసిన మాంసాహారంలో సోడియం నైట్రైట్, సోడియం నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి న్రైటొసమీన్స్‌గా మారి క్యాన్సర్ అవకాశాన్ని పెంచుతాయని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది. రోడ్డుమీద కాల్చి అమ్మే మాంసాహార పదార్థాలు కూడా తినకూడదు.




3.చక్కెర ::
చక్కెర వల్ల క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతాయని అంటుంటారు. అందుకే క్యాన్సర్ పేషెంట్లు తియ్యగా ఉంటాయని పండ్లు కూడా తినక అవసరమైన పోషకాలను పొందలేరు. నిజానికి దీనికి స్పష్టమైన రుజువులేమీ లేవు. అయితే చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కేలరీలు పెరిగి ఊబకాయం తద్వారా హార్మోన్లలో తేడాలు వస్తాయి. ఫలితంగా రొమ్ము, పెద్దపేగు, గర్భసంచి క్యాన్సర్ల అవకాశాలుంటాయి



4. వేపుళ్లు, చిప్స్ ::
చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు. ఇలాంటి స్నాక్స్‌లో అక్రిలమైడ్ అనే క్యాన్సర్ కారకం ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల్లో (250 డిగ్రీ ఫారన్‌హీట్) వేడిచేసినప్పుడు అంటే వేపుడు, బేకింగ్ లాంటివి చేసినప్పుడు ఆహారపదార్థాల నుంచి ఇది తయారవుతుంది.
దీర్ఘకాలం పాటు అక్రిలమైడ్‌కి ప్రభావితం కావడం వల్ల ఎలుకల్లో కణుతులు ఏర్పడినట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఇటువంటి ఆహార పదార్థాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌ల అవకాశం పెంచడంతో పాటు క్యాన్సర్ కారకాలు కూడా


.
5. ఆల్కహాల్ ::
ఆల్కహాల్ తీసుకోవడానికి క్యాన్సర్‌కి సంబంధం ఉందని అనేక రకాల రుజువులున్నాయి. నోరు, గొంతు, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్లే కాకుండా రొమ్ము క్యాన్సర్‌కి కూడా ఇది దోహదం చేస్తుంది.

No comments:

Post a Comment