పెరుగుతున్న ముదురు వివాహాలు
30 దాటిన తర్వాతే ఆలోచిస్తున్న యువత
సకాలంలో పెళ్లి చాలా అవసరం
స్థిరపడ్డాక అనుకుంటే అసలుకే మోసం
ఆలస్యమైతే హార్మోన్ల అసమతుల్యత
సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం
గతంతో ఓ వయసు వచ్చేసరికి పిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు. ప్రస్తుతం యువత ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. జీవితంలో స్థిరపడిన తరువాతే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. ఆడ, మగ అన్న వ్యత్యాసం లేకుండా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఎక్కువ మంది 30 వస్తే కాని పెళ్లి ప్రస్తావన తేవడం లేదు. లేటు వివాహ ప్రభావం సంతాన ఉత్పత్తిపై పడుతోంది. ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లలో మార్పులతో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటోంది. కంప్యూటర్లు, లాప్‌టాప్‌లతో కుస్తీ, నిద్రలేమి తదితర కారణాలతో సంతాన సాఫల్య సామర్థ్యం దెబ్బతింటోంది.
గుంటూరు (నల్లచెరువు): మానవ జీవితం శరీరంలోని హార్మోన్లతో ముడిపడి ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరంలో హార్మోన్ల విడుదల క్రమబద్ధంగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురైతే హార్మోన్ల విడుదల అసమతుల్యత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఏర్పడిన సమస్యలు, ఒత్తిడి వంటి కారణాలతో హార్మోన్‌ల సమతుల్యం దెబ్బతింటోంది. కంప్యూటర్లు, లాప్‌టాప్‌లతో కుస్తీ, స్కూటస్ టెంపరేచర్, నిద్రలేమి తదితర కారణాలతో వీర్య కణాల ఉత్పత్తి తగ్గి సంతాన సాఫల్య సామర్థ్యం దెబ్బతింటోంది. సాధారణంగా పురుషుడి వీర్యంలో ఒక మిల్లీ లీటరకు 130 మిలియన్ల శుక్రకణాలు ఉండాలి. వీటి సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. డబ్ల్యుహెచ్‌వో తాజా నివేదిక ప్రకారం శక్ర కణాల సంఖ్య 105 మిలియన్లకు తగ్గినట్లు తేలింది. ఈ అంశం కూడా సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతోంది.
ప్రపంచీకరణ పాపం
ప్రపంచీకరణ పుణ్యమాని జీవితం ఉరుకుల పరుగల మయంగా మారింది. ఉద్యోగంలో నెట్టుకు రావాలంటే లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం కాలంతో పోటీ పడాలి. ఒక వేళ నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగానికే ఇబ్బంది. దీంతో వృత్తి, ఉద్యోగా ల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని బయట పడేందుకు మద్యం, సిగరెట్లు, డ్రగ్స్ వంటి వాటికి అలవాటుపడుతున్నారు. దీంతో లైంగిక ఆసక్తి తగ్గిపోతోంది.
జీవన శైలిలో మార్పులు
ఆధనిక కాలంలో మనిషి జీవన విధానంలో పెనుమార్పులు చోట చేసుకుంటున్నాయి. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కోసం ఉదయం లేవడం మొదలు అర్థరాత్రి నిద్రపోయే వరకు కుస్తీ పడుతున్నా రు. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. ఇంటికి చేరాక ఫేస్‌బుక్, వాట్సాప్ చాటింగ్‌ల్లో మునిగి తేలుతున్నారు. దీంతో దంపతుల మధ్య సౌకర్యవంతమైన లైంగిక జీవనం కొనసాగడం లేదు. ఇది సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతోంది.
తిండితో తంటా
పని ఒత్తిడితో సమయానికి తిండి, నిద్ర అవసరమన్న విషయం కూడా చాలా మంది గుర్తుకురా వడం లేదు. పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్ వంటి ఫాస్ట్ ఫుడ్‌కు అవాటుపడుతున్నారు. వీటిని తినడం, శారీరక వ్యాయామం ఉండకపోవడంతో ఒబేసిటి, డయాబెటిస్‌కు దారితీస్తోంది. ఈ కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది.
ఆధునిక పరిజ్ఞానం అండ
వివిధ కారణాలతో సంతాన లేమితో బాధపడుతున్న వారికి వైద్య రంగంలో వచ్చిన అధునాతన విధానాలు కొంత ఉపయుక్తంగా ఉంటున్నాయి. ప్రధానంగా ఐయూఐ, ఐవీఎఫ్ విధానాలు ఆదు కుంటున్నాయి. ఈ పద్ధతుల్లో సక్సెస్ రేట్ 30 నుం చి 70 శాతం మాత్రమే ఉంటుంది. అందుకే సరైన సమయంలోనే వివాహం చేసుకోవడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
30 దాటితే ప్రమాదమే...
వివాహం చేసుకునేందుకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు అత్యత్తమం. 25 నుంచి 30 ఏళ్ల మధ్య పర్వాలేదు. కానీ 30 ఏళ్లు దాటితే మహిళలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుత తరం 30 నుంచి 35 ఏళ్లు వచ్చిన తరువాతే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లు దా టిన తరువాత మహిళల్లో అండాల విడుదల తగ్గిపోతుంది. దీంతో సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుముఖం పడుతుంటాయి. కొంతమంది మహిళల్లో పాలిస్టిక్ ఒవెరియన్ డిసీజ్ కనిపిస్తోంది. దీంతో మహిళల్లో మేల్ హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ఉత్పత్తి పెరిగి పీరియడ్స్ క్రమం తప్పుతాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేయకూడదు
దూమపానం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి
డ్రగ్స్, స్టెరాయిడ్స్‌కు చాలా దూరం అవసరం
లైట్ (పల్చని)గా ఉండే అండర్‌వేర్లు జీన్ ప్యాంట్‌లు ధరించకూడదు.
జంక్ ఫుడ్, ఫాస్ట్‌ఫడ్స్‌కు దూరంగా ఉండాలి
యోగా, మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి
నిద్రపోయే ముందు టీవీ, చాటింగ్ మానేయాలి
ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి
ఆలస్యంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే పురుషులు తమ వీర్యాన్ని స్మెర్మ్ బ్యాంకు, మహిళల అండాల ఎగ్‌బ్యాంక్‌లో భద్రపరుచుకోవాలి.
మరికొన్ని వాస్తవాలు
పురుషుడి వీర్యంలో ఒక మిల్లీలీటరకు 130 మిలియన్ల శుక్రకణాలు ఉండాలి. వీటి సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. డబ్ల్యుహెచ్‌వో తాజా నివేదిక ప్రకారం శుక్రకణాల సంఖ్య 105 మిలియన్లకు తగ్గినట్లు తేలింది.
వయసు 30 దాటిన తరువాత మహిళల్లో అండాల విడుదల తగ్గిపోతుంది. దీంతో సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుముఖం పడుతుంటాయి. కొంతమంది మహిళల్లో పాలిస్టిక్ ఒవెరియన్ డిసీజ్ కనిపిస్తోంది.
కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. ఇంటికి చేరాక ఫేస్‌బుక్, వాట్సాప్ చాటింగ్‌ల్లో మునిగి తేలుతున్నారు. దీంతో దంపతుల మధ్య సౌకర్యవంతమైన లైంగిక జీవనం కొనసాగడం లేదు.
30 దాటిన తర్వాతే ఆలోచిస్తున్న యువత
సకాలంలో పెళ్లి చాలా అవసరం
స్థిరపడ్డాక అనుకుంటే అసలుకే మోసం
ఆలస్యమైతే హార్మోన్ల అసమతుల్యత
సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం
సకాలంలో పెళ్లి చాలా అవసరం.. యువతకు వైద్యుల హెచ్చరిక !

No comments:
Post a Comment