s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

గర్భంతో ఉన్న స్త్రీ చేయవలిసిన పనులు : pregnant women duties

ఒకతనికి వివాహం అయింది. అతడు పిల్లలు వద్దు అనుకున్నారు. ఎందుకు అని అడిగితే ప్రస్తుత పరిస్థితులు చెప్పి ఆడపిల్లలు కాదు పిశాచాలు పుడుతున్నాయి. మగపిల్లలు మృగాల్లా తయారవుతున్నారు. అలాంటప్పుడు పిల్లలని కని పెంచి పోషించి దేశాన్ని నాశనం చేయడం ఎందుకు? అందులోనూ ఇది కలికాలం. రానున్నది కాలం ఇంకా ముదిరి పోతుంది. ఇప్పటికే చూస్తున్నాం కదా! కట్టు బొట్టు వదిలేసి పిశాచాల్లా జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారు. ఇలాంటి సంతానం నాకు వద్దు బాబోయ్ అన్నాడు.





కలికాలంలో కూడా న్యాయం పూర్తిగా కనుమరుగు ఎవ్వడు. ఎంతో కొంత మిగిలే ఉంటుంది.. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం తీసుకుంటే కల్కి భగవానుడు వచ్చేనాటికి ఉత్తములు కొందరు ఉంటారు. వారిని వెంట తీసుకెళ్లి దుష్టసంహారం చేసి రాజ్యాన్ని పాలిస్తాడు. అంటున్నాయి. కనుక ఎంతోకొంత మంచి ఉంటుంది. పూర్తిగా మాత్రం కనుమరుగు అవ్వదు.





ఇకపోతే! పిల్లలు ఇలా తయారవ్వడానికి కారణం తల్లిదండ్రులే బాధ్యత. స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు చేయకుండా చూడకూడనివి చూస్తూ, వినకూడనివి వింటూ చేయకూడనివి చేస్తూ ఉంటే ఉత్తమ సంతానం ఎలా కలుగుతుంది?





గర్భంలో అండం ప్రవేశించిన నాటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాని ఎవరూ తీసుకోవడంలేదు. సినిమాలు, షికార్లు, రోడ్ల మీద దొరికే అడ్డమైన చెత్త, కూల్ డ్రింక్స్, నోటికి వచ్చింది మాట్లాడడం, బూతులు తిట్టుకోవడం, అసందర్భ ప్రలాపాలు, గొడవలు, వెళ్లకూడని ప్రదేశాలకి వెళ్లడం, చేయవలసిన పనులు చేయకపోవడం ఇలాంటి అనేక కారణాల వలన సంతానం చెడు త్రోవలు పడుతుంది. అసలు గర్భంతో ఉన్నప్పుడు స్త్రీ తీసుకోవలసిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన పనులు చూద్దాం.






గర్భంతో ఉన్న స్త్రీ చేయవలిసిన పనులు :

సంతోషంతో ఉండాలి, ప్రశాంత మనస్సుతో ఉండాలి, మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. వీలైనంత మౌనం వహించాలి. వీలైనంత భక్తితో ఉండాలి. భక్తి సినిమాలు చూడాలి, మంచి మాటలే వినాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, బరువులు మోయకూడదు. సాత్విక ఆహారం తీసుకోవాలి. వీలైనన్ని ఆవుపాలు త్రాగాలి, చాలని అతి శీతల మరియు అతి వేడి  పానీయాలు, అతి శీతల మరియు అతి వేడి పదార్ధాలు, త్రాగకూడదు, తినకూడదు,



 ఆల్కాహాల్, సిగిరెట్లు, గుట్కాలు లాంటివి దగ్గరకి కూడా రానీయకూడదు. మనస్సుని ఆధ్యాత్మిక మార్గంలోనే ఉండాలి. దైవ చింతనలో గడపాలి, దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనాలు చేసుకోవాలి. ఏడవడం, అరవడం చేయకూడదు, అసత్యాలు, తప్పుడు పనులు చేయరాదు. సంగమం కూడా చేయకూడదు. దీనివలన లోపల బిడ్డ బాధ పడుతుంది. చిరుతిళ్ళు, బొప్పాయి లాంటివి అసలు దగ్గరికి రానీయకూడదు.







ఇక్కడ చెప్పినవి కొన్ని మాత్రమే. ఇంకా ఎన్నో చేయాలి. ఐతే వీటిని ఎవరు ఆచరిస్తున్నారు అని ప్రశ్నిస్తే సమాధానం దాదాపు శూన్యం.. ఉత్తములైన సంతానం కావాలంటే వీటిని తప్పనిసరిగా పాటించి తీరాలి. ఉద్యోగాలు చేయాలి సంపాదించాలి అంటే సంతానం మంచిది కావాలి అని కోరుకోకండి. పుట్టబోయే సంతానంతో సంతోషించండి. స్త్రీ మామూలుగానే ఇతర పురుషులతో మాట్లాడ కూడదు అంటే ప్రపంచం మారుతుంది మనం మారాలి అని రోడ్లమీదకి లాగేశారు.




 అలాంటి స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఉద్యోగాలు చేస్తూ, రోడ్ల మీద దొరికింది తింటూ తిరిగితే పుట్టబోయే సంతానం ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. స్త్రీ ఉద్యోగం చేయాలి ఊళ్లు ఏలాలి అని సమర్ధించడానికి మీరు ఎన్ని చెప్పుకున్నా దానికి తగ్గ ప్రతిఫలం కనులముందు నిత్యం చూస్తూనే ఉన్నాం. తెలుసుకునేవారు తెలుసుకోండి. లేదు మేము ఇంతే అంటే అంతకు తగ్గితే కుటుంబం ఉంటుంది. సందేహించాల్సిన పనిలేదు..

No comments:

Post a Comment