s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

ఏ రుద్రాక్ష ధరిస్తే ఏ ఫలితం లభిస్తుంది? rudraksha miracles



ఏ రుద్రాక్ష ధరిస్తే ఏ ఫలితం లభిస్తుంది?

                 . శివుడుని షణ్ముఖుడు రుద్రాక్షల మహిమ అడుగగా తెపిలిన రుద్రాక్ష మహిమ..   జప సాధకుడు యధావిధిగా భస్మమును, రుద్రాక్షలు ధరించవలయును. కంఠమున ముప్పది రెండు (32), తలపై నలుబది(40), చెవులకు ఆరేసి చొప్పున ప్రతి చేతియందు పండ్రెండేసి(12) చొప్పున, ప్రతి భుజము నందు పదహారు వంతున నేత్రములకు ఒక్కొక్కటి చొప్పున, జుట్టు యందు ఒకటి, రొమ్ముపై నూట ఎనిమిది దాల్చువాడు కేవలం నీలకాంఠుడై పరమశివుడే అగును.



ఏకముఖి రుద్రాక్ష : సాక్షాత్తు శివుడే. బ్రహ్మహత్యా పాతకములు పోగొట్టును.
ద్విముఖి :  శివ స్వరూపము. సకల పాతకములు అణచివేయును.
 త్రిముఖి  : అగ్ని స్వరూపము; క్షణములో స్త్రీహత్యా దోషమును హరించివేయును.




చతుర్ముఖి  : బ్రహ్మస్వరూపము;నరకహత్యా దోషమును బాపును.
పంచ ముఖి : కాలాగ్ని; తినరానివి తినుట, పోరాని చోట్లకు పోవుట వలన గలుగు పాపములను తుడిచిపెట్టివేయును. ఈపంచముఖి రుద్రాక్ష దాల్చుట వలన సర్వపాపములు సమసిపోవును.
షణ్ముఖములు : ఇది షణ్ముఖుడు. దీనిని కుడిచేతి యందు ధరింపవలయును.అటుల దాల్చుట వలన అది బ్రహ్మహత్యా పాపములు పోగొట్టును. సందేహించరాదు.




సప్త ముఖాములు : అనంగ రూపమైనది; ఇది సౌభాగ్యవంతమైనది. దీనిని ధరించుట వలన బంగారము దొంగతనం చేసిన పాపము పోగొట్టును.
 అష్ట ముఖములు: సాక్షాత్తు వినాయకుడే; దీనిని దాల్చుట వలన అన్న వస్త్ర సువర్ణములకు లోపము కలుగదు. కులము గాని స్త్రీని, గురుపత్నిని తాకిన పాపమును, ఇతర పాపములను మొత్తము దీనిని దాల్చుట వలన నశించగలవు.


నవ ముఖములు : ఇది భైరవము; దీనిని ఎడమ భుజముపై దల్చవలయును.భుక్తి-ముక్తి కలిగించగలదు. అది నారాయణుడి అంత బలము గలది. వేల బ్రాహ్మణ హత్యలు, నూరు బ్రహ్మహత్యలు, నవ ముఖ రుద్రాక్ష దాల్చుటవలన వెంటనే నశించిపోగలవు







దశ ముఖములు : సాక్షాత్తు దేవేశుడైన జనార్దనుడే; గ్రహ, పిశాచ, భేతాళ, బ్రహ్మరాక్షస, పన్నగముల (సర్పముల) వలన బాధలన్నియు తొలగిపోవును.
ఏకాదశముఖములు: రుద్రుడే; దీనిని తలపైదాల్చువాని పుణ్యము అనంతము. వేయి అశ్వమేధములు, నూరు వాజిపేయ యాగములు, పదివేల గోదానములు చేసినంత పుణ్యము. శీఘ్రముగా ఏకాదశ రుద్రాక్ష దాల్చుట వలన ఇవి కలిగి తీరును.


 ద్వాదశ ముఖములు : చెవియందు దాల్చవలెను. దాని వలన నిత్యమూ ద్వాదశాదిత్యులు ప్రసన్నులగుదురు. అశ్వమేధ – గోమేధ ఫలములు లభించును.పశువుల, శాస్త్రముల, పులుల వలన ఎటువంటి భయము కలగదు. ఆదివ్యాధులు కలుగవు. ఎటువంటి భయము, వ్యాధులు కలుగవు. ముమ్మాటికి భయములేదు. అతడు సఖి – ఈశ్వరుడే యగును. ఏనుగు గుఱ్ఱము, జింక, కుక్క, నక్క, పిల్లిం ఎలుక,గాడిద, దుర్దురము మున్నగు జీవులను చంపినా వానియును ద్వాదశ రుద్రాక్ష దాల్చుట వలన తొలగును. పాపవిముక్తుడు అగును. సందేహములేదు.


త్రయోదశ ముఖములు : అది లభించినచో కార్తికేయునితో సమానము. సకలార్ధ సాధకము. అతనికి ఎల్ల రసములు-రసాయనములు సిద్ధించును. ఎల్లా భోగవస్తువులు అనుభవింపగలడు.
చతుర్దశ ముఖములు : ఇది లభించుట కష్టము.దీనిని తలపై ధరింపవలయును. అతడు సదా శివస్వరూపుడవును. మాటిమాటికి చెప్పనేల! అతడు దేవపూజ్యుడు అగును. పరమగతి నోన్దగలడు. ద్విజుడు ఒకే రుద్రాక్షను శిరస్సుపై దాల్చవలయును.





26 రుద్రాక్షల మాలిక శిరస్సుపై, యాబది ఆరు రుద్రాక్షల మాలిక హృదయముపై, పదహారు రుద్రాక్షల మాలిక భుజములపై, పండ్రెండు రుద్రాక్షల మాలిక మణిబంధముల యందు, నూట ఎనిమిది రుద్రాక్షల మాల గాని, ఏబది రుద్రాక్షల మాలగాని, ఇరువది ఏడు రుద్రాక్షల మాలికగాని, ధరించినచో లేక దానితో జపించినచో అతనికి అనంత ఫలములబ్బును. నూట ఎనిమిది రుద్రాక్షల మాలిక ధరించినవాడు క్షణక్షణమశ్వేమేద ఫలములు పొందగలడు. అతడు 21 తరముల వారిని ఉద్ధరించి శివలోకము నందు నివశించగలడు.





  దేవి భాగవతం దశమ స్కంధం : రుద్రాక్ష మహిమ.

No comments:

Post a Comment