s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

అమ్మ బాషలు మరవద్దు.. mother tongue dont foget it

అమ్మ బాషలు మరవద్దు.. ఇది మొదటికే ప్రమాదం తీసుకొస్తుంది. - 1వభాగం.
భాషలకి మూలం సంస్కృతం. అందునా అన్నిబాషల్లో తెలుగు భాష ఉత్తమోత్తమం. ఈ సంస్కృత బాష, హిందీ, తెలుగు, కన్నడ ఇవి ఇంచుమించు చాలా అక్షరాలు కలుస్తాయి. తెలుగు కన్నడ అక్క చెల్లెళ్ళు లా ఒకే విధంగా ఉంటాయి. ఇకపోతే సంస్కృతంలో ఉండే "अ आ इ ई उ ऊ" తెలుగులో ఉండే "అ ఆ ఇ ఈ ఉ ఊ" చదివే విధానం కాని ఈ రెండుభాషలో ఉన్న పాండిత్యం కాని పాండిత్యంలో ఉన్న లోతులు కాని మరే బాషలో లేవు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.




సంస్కృత భాషలో అదికూడా ఇప్పటి సంస్కృతం కాదు సుమా! దేవ సంస్కృతం అంటే మన ఋషులు వ్రాసిన "రామాయణం, భారతం, భాగవతం, ఇతర పురాణాలు ఇవన్నీ దేవ నిర్మిత సంస్కృతం. ఇది ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. వాడుక భాషలో ఉన్న సంస్కృతంలా దీనిని చదవకూడదు. అలా చదివితే దోషాలు రావడమే కాకుండా అపార్థం చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనకి లభిస్తున్న సంస్కృత అనువాదాలు సగంపైగా తప్పుల తడకలే. ఎందుకంటే అరకొర పాండిత్యం నేర్చుకున్నవారు వ్రాసినవే ఎక్కువ ఉన్నాయి


.
తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి అమ్మా అనే పిలుపుని మరచిపోతున్న తెలుగు ప్రజలు కోకొల్లలు. ఇలాంటివారు తెలుగు అనువాదాలు చేస్తే భూతులు కాక స్వచ్చమైన తెలుగు వస్తుందా? ఇక ఇప్పటి ఉపాద్యాయులు చెప్పే సంస్కృతం నేర్చుకొని దానిని అనువాదం చేస్తే ఎలా ఉంటుందో ఇక చెప్పే పనేముంది?
అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నారు? అని అనుకుంటున్నారా?




సంస్కృతం తెలుగు ఈ రెండు భాషలు మనిషిలో ఉన్న అనేక దోషాలను పారద్రోలుతాయి. మనం చదివే "అ ఆ ఇ ఈ ఉ ఊ"నుండి య ర ల వ... క్ష.. ఱ వరకు మనలో ఉన్న ఆరు చక్రాలలోని ఆకులలో శక్తిని నింపుతాయి. దీనివలన శరీరం శక్తిని సంగ్రహిస్తుంది. తద్వారా మనిషిలో నిద్రాణంలో ఉన్న అనేక శక్తులు ఉత్తేజితం చెంది చైతన్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఇవన్నీ బీజాక్షరాలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంది. ప్రతి అక్షరం విలువైనదే. ప్రతి అక్షరం పరమ పవిత్రమైనదే.


మంత్రం చదివితే ఫలిస్తుంది అంటే ఆ మంత్రాన్ని మనం శక్తి గా మలుచుకొని మనకు కావలసింది మనం పొందుతున్నాం. స్వశక్తితో సాధించలేనిది మంత్రంతో సాధించవచ్చు. మంత్రం అంటే బీజాక్షరం. ఆ బీజక్షరాలే మన అ ఆ ఇ ఈ లు.. వీటి నుండే మంత్రం పుడుతుంది తప్ప మరొక భాష నుండి కాదు.
అందుకే సంస్కృతం-తెలుగు మానవులకి అమృతం కన్నా ఎక్కువ. ఈ అమృతాన్ని వదిలి విషాన్ని స్వీకరిస్తున్నారు నేటి తరం.. ఆంగ్లం కేవలం ఉపాధి కోసమే అనే విషయాన్నీ మరచి ఆంగ్లమే లోకం అని అమ్మని (మమ్మీ) పీనుగుని చేసి పిలుస్తున్నారు. ఇలా పిలిస్తే వక్ర బుద్దులు కాక సద్బుద్ధులు వస్తాయా? రావు ఎప్పటికీ రావు.






మీరు అడగొచ్చు అ ఆ లు నేర్చుకుంటే బుద్ధి మారుతుందా అని! దేనినైన వాడుకునే విధానం లో ఉంటుంది. తెలిసి కాని తెలియక కాని నిప్పుని పట్టుకుంటే ఎలా కల్చుతుందో! మన బాషలు చదవడం వలన జ్ఞానం మాత్రం అబ్బుతుంది ఇది సత్యం.



ఈసృష్టిలో తెలుగు సంస్కృత భాషలను మించిన బాషలు లేవు. కావాలంటే బేరీజు వేసుకోండి. మన భారతీయుల జీవన విధానం ఎలా ఉంది? ఇతర బాషల జీవన విధానం ఎలా ఉంది? ఇతర దేశస్థుల జీవన విధానంలో విచ్చలవిడి తనం తప్ప మరొకటి కానరాదు. అందుకే ప్రపంచం భారతదేశం యొక్క సంస్కృతి వైపు పరుగులు తీస్తుంది. కానిమనం మాత్రం ప్రపంచంవద్దు అనుకొని వదిలేస్తున్నవాటివైపు పరుగులు పెడుతున్నాం..
తరువాతి భాగంలో ఏ అక్షరంలో ఏఫలితం ఉంది? తెలుసుకుందాం..









No comments:

Post a Comment