యజ్ఞం వలన దేహం శుద్ధి జరుగుతుంది. యజ్ఞం వలన అనేక రోగాలు తొలగిపోతాయి. యజ్ఞం వలన ఆయుష్షు పెరుగుతుంది. యజ్ఞం వలన శుభాలు కలుగుతాయి. యజ్ఞాల వలన భూత శాంతి కలుగుతుంది. యజ్ఞాల వలన వర్షము కురుస్తుంది. యజ్ఞంతో చేయలేని, అవ్వని పనిలేదు. యజ్ఞంతో ఏదైనా సాధించవచ్చు. ఇలా చెబితే ఎవరూ నమ్మరు. పైగా ఇది కలికాలం కావడం చేత వితండవాదం ఎక్కువగా ఉంటుంది. పనికిరాని భూతదయ, దయ జాలి స్థాయిని మించి అధికంగా ఉంటాయి. 25ఇవ్వవలసిన చోట 1000 ఇవ్వడానికి కూడా వెనుకాడరు. వెయ్యి ఇవ్వవలసిన చోట 100ఇవ్వడానికి ఏడుస్తారు.
ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, వివాహం కోసం, సంతానం కోసం, స్నేహం కోసం, మళ్ళి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క యజ్ఞం ఉంటుంది. క్షయ కి ఒకటి, కుష్ఠుకి ఒకటి, రాజ యాక్ష్మం కోసం ఒకటి, జ్వరం కోసం ఒకటి ఇలా రకరకాలుగా ఉంటాయి. కోర్కెల తీరడం కోసం ఒకటి, ఇంట్లో ఉండే దోషాలు పోవడం కోసం, నరదృష్టి సోకకుండా ఒకటి, ఆలా చెప్పుకుంటూ పొతే ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి.
పూర్వం రాజులు వేలకొలది సంవత్సరాలు బ్రతికేవారు, మునుల సంగతి చెప్పేపనిలేదు. కోటాను కోట్ల సంవత్సరాలుగా జీవిస్తున్నవారు ఇప్పటికీ ఉన్నారు. యజ్ఞం చేస్తే దేవతలు ఆహ్వానించబడతారు అనేది నిజమే అయినప్పటికీ దేవతలు వస్తారా? అనే సందేహం కొందరిది. అన్ని కంటికి కనబడితేనే నమ్ముతాం అంటే కష్టం. నీ ఒంటికి రోగం వచ్చినప్పుడు నీకు శరీరం మీద స్పృహ ఉంది కనుక ఫలానా రోగం వచ్చింది
అని చెప్పగలుగుతున్నావు. మరి స్పృహ లేనివారి సంగతి ఏంటి? స్పృహ ఉండికూడా వారికి వచ్చిన సమస్యను సరిగ్గా చెప్పలేనివారు కోకొల్లలు. ఇలా నీశరీరం గురించే నీకు అవగాహన లేనప్పుడు దేవతలు రారు, లేరు అని నువ్వు ఎలా చెప్పగలవు? రోగికి వైద్యం చేస్తే అతనికి వచ్చిన బాధ తగ్గుతుంది కనుక మందు పని అంటున్నావు. కానీ ఆ మందు ఎలా నీశరీరంలోకి వెళ్లి పని చేస్తుందో చూడగలవా?
. ఉదాహరణకి యజ్ఞాలలో వాడే ఆవు నెయ్యి వలన, ఆవు పేడ వలన, పెరుగు, వెన్న వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రోగాలని ఇట్టే నయం చేస్తాయి. ఇక మారేడు దళాలు, మారేడు కట్టెలు, తులసి, రావి, వేప, కదంబం, ఇలాంటివి మనకి తెలియని ఎన్నో చెట్లు మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేవే.. వీటిలో కొన్నిటిని కలిపితే కొన్ని రోగాలు, కొన్నిటిని కలిపి యజ్ఞం చేస్తే కొన్ని సమస్యలు, కొన్నిటిని కలిపి యజ్ఞం చేస్తే భూత శాంతి, కొన్ని కలిపి యజ్ఞం చేస్తే మనశ్శాంతి కలుగుతాయి. కేవలం ఈ యజ్ఞాలలో నెయ్యి, పంచగవ్యంలో వేసి వ్రేల్చడం ఆ ధూపం పీల్చడం తోనే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.
భోగం అనుభవించడమే యోగం అనే స్థాయికి దిగజారిపోయాడు. పైపెచ్చు రాక్షసులు మానవ రూపాలలో తిరుగుతూ ఉండడం వలన శాస్త్రం తెలుసుకోవాలి అనుకునేవారికి ఎన్నో ఆటంకాలు కల్పించడం, మనస్సులో ప్రవేశించి అటుగా ప్రయత్నించడకుండా అడ్డుపడడం ఇలా అనేకానేక కారణాల వలన మనిషి యజ్ఞాలకి దూరమైపోయాడు. ఆయుష్షు తగ్గించుకుంటున్నారు. రోగాలు కొని మరీ తెచ్చుకుంటున్నారు.
No comments:
Post a Comment