s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

కుంకుమ ఎందుకు ధరించాలి?

కుంకుమ ధరించటం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు. స్త్రీ పురుషుల్దిరికీ సంబంధించినది.
కుంకుమ పెట్టుకోవటం హిందూ సంప్రదాయం! అన్ని కులాల హిందువులు, శైవ వైష్ణవ మతస్థులు అందరూ నొసటన కుంకుమ ధరించటం గొప్పదనంగా భావిస్తారు.
కుంకుమ ఆస్తికత చిహ్నం!



ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకూ హిందూ మతస్తులందరూ తప్పనిసరిగా కుంకుమను నొసట దిద్దుకొనే ఆచారం బలీయంగా ఉండేది. ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా ఉండేది. హరిచందనాన్ని, మంచి గంధాన్ని, విభూతిని గూడా నొసట ధరించటం హిందూ సంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు పూర్వీకులు.










రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో నుదుటివద్ద ఇడ పింగళ నాడులు కలిసి సుషమ్న నాడిగా పరివర్తన చెందే స్థలం వద్ద కుంకుమను దిద్దుకుంతం. ఈ కుంకుమ వల్ల మనిషికి దృష్టి దోషం తగులకుండా ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది. మరొకటేమిటంటే కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటి వారు మానసికంగా లొంగి పోతారన్న (సైకాలజీ) వాదన కూడా ఉంది. ఎర్రని ఎరుపురంగు మనిషికి మనోశక్తిని, త్యాగ తత్వాన్నీ, నిర్భయత్వాన్నీ, పరోప కారగుణాన్నీ కల్గిస్తాయన్న థియరీ కూడా ఉంది.





కుంకుమ ధరించటం పవిత్రతకు, ఆస్తికత్వానికి ధార్మిక త్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవ తనానికీ, సౌభాగ్యానికీ, స్థిర బుద్ధికి సంకేతంగా చెప్పవచ్చు. మానవుడు నాగరికత నేర్చిన దగ్గర నుండి కుంకుమను ముఖ్య అలంకారంగా కూడా భావించినట్లు కొన్ని గ్రంథాలలో ఉంది.




కుంకుమ భారతీయతకు చెరుగని ముద్ర. పాశ్చాత్య నాగరికత మనమీదకు దాడిచేసిన తరువాత పురుషులందరూ కుంకుమధారణ మరచిపోయారు. ఇంకొంతకాలానికి స్త్రీలు కూడా మరచిపోవచ్చునేమో! దేవుళ్ళు మాత్రమే మిగుల్చుకుాంటారేమో! ఎవరికి తెల్సు?

No comments:

Post a Comment