s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

గుండెపోటు వచ్చిన వెను వెంటనే ఏం చేయాలంటే…… Soon after the attack in order to do ....

అకస్మాత్తుగా గుండెలో ఏదో మంటలా అనిపిస్తుంది.
క్షణాల్లో అది ఎడమ ఛాతీకి వ్యాపిస్తుంది. చెమటలు పడతాయి.
కళ్లు తిరిగి పడిపోవచ్చు.
మొత్తా నికి తనకు ఏదో జరుగనుందని, తాను బతకకపోవచ్చని రోగికి అనుమానం వస్తుంది.
ఇవన్నీ గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు.





వీటిని గుర్తించి, వెంటనే చికిత్స ప్రారంభిస్తే
గుండె పోటు వల్ల సంభవించే మరణాన్ని వీలైనంత మేరకు తగ్గించ వచ్చు.
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే క్రమంలో ఆకస్మాత్తుగా రక్తం గడ్డ కట్టినప్పుడు ఒక ప్రాంతానికి రక్తం ఆగిపోతుంది. అప్పుడు అందులో ఉండే కణాలు దెబ్బతింయి. దీన్నే గుండెపోటు అంటారు.



సర్వ సాధారణంగా గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయంటే……..
ఉన్నట్లుండి చాతీలో ఏదో బండరాయి మోపినట్లుగా, మంటలాగా వస్తుంది. కొద్దిక్షణాల్లో ఎడమ ఛాతీకి వ్యాపిస్తుంది. తర్వాత విపరీతమైన చెమటలు రావడం, కళ్లు తిరిగి పడిపోవడం గానీ, ఆయాసంగానీ వస్తుంది. ఏదో జరుగుతోందనే విషయం వారికి అర్థమవుతుంది. బతకకపోవచ్చని భావిస్తారు.
గుండె పోటులో ఇది మొది లక్షణం.






వయసు పెరిగిన వారిలో, మధుమేహ రోగుల్లో నొప్పి లేకుండా కూడా గుండెపోటు సంభవించవచ్చు.
దీనిని సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటాము.
గుండె పోటు వచ్చినప్పుడు ఎంత తొందరగా హాస్పిటల్‌కెళితే అంత మంచిది. ఎందుకంటే వెంటనే చికిత్స చేయాలి. ఆలస్యం చేస్తే రక్తం గడ్డకడుతుంది. గడ్డమీద కొత్త ప్లేట్ లెట్స్ అతుక్కోకుండా ఆస్ప్రిన్‌ టాబ్లెట్స్ ఇవ్వాలి. గుండెపోటు వచ్చిన తొలి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారు.



ఈ సమయంలో ఆలస్యం చేయడం వల్ల 50 శాతం మంది చనిపోయే అవకాశం ఉంటుంది.
గుండెపోటు వచ్చిన వెను వెంటనే ఏం చేయాలంటే………
గుండెపోటు వచ్చిన రోగి మెట్లెక్కడం గానీ, డ్రైవింగ్‌ గానీ, కదలడం గానీ చేయకూడదు.
డిస్ప్రిన్‌ పేరుతో ఆస్ప్రిన్‌ టాబ్లెట్స్ దొరుకుతుంది. ఇది చాలామంది తలనొప్పికి వాడే మాత్ర.
సర్వసాధారణంగా ఇంట్లో అందరికి తెలిసే ఉంటుంది. దీన్ని వెంటనే ఇవ్వాలి.
తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లాలి.




నిర్ధారణ..
గుండెపోటును నిర్ధారించడానికి చేసే మొదటి పరీక్ష ఇసిజి. తరువాత కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. ఆర్వాత యాంజియోగ్రాం చేస్తే ఎక్కడ బ్లాక్‌ ఉందో తెలుస్తుంది. రక్తంలోని గడ్డను కరిగించడానికి ఒక ఇంజక్షన్‌ ఇస్తారు. యాంజియోగ్రాం తరువాత వెంటనే స్టింట్ చికిత్స చేస్తారు.




జాగ్రత్తలు..
గుండెపోటుకు చికిత్స తరువాత జీవితాంతం మందులు వాడాలి. బిపి, షుగర్‌, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్లో పెట్టుకోవాలి. భోజన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు టైమ్‌ ప్రకారం వాడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముందు 15 రోజులకు, తర్వాత నెలకు, తర్వాత 3 నెలలకు, 6 నెలలకు, ఏడాదికి గుండె పరీక్ష చేయించు కోవాలి. ఆ తరువాత ప్రతియేడాదికి ఒకసారి చెక్‌ చేయించుకోవాలి. నాలుగైదేళ్ల వరకు యాంజియోగ్రామ్‌ అవసరం ఉండదు. కానీ స్టంట్ వేసిన తరువాత ఐదేళ్లకు మళ్లీ ఎంజియోగ్రామ్‌ చేయించుకోవడం మంచిది. కొత్త సమస్య ఏర్పడితే ముందే గుర్తించవచ్చు. కొవ్వు పదార్థాలు మానాలి. ఎక్కువగా కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు తీసుకోవాలి.

No comments:

Post a Comment