ఒకసారి కంచి పరమాచార్యుల దర్శనానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. స్వామి వారిచ్చే తీర్థం తీసుకుని, అదే తీర్థం తనతో తెచ్చుకున్న చిన్న పాత్రలో కూడా కొద్దిగా ఇమ్మని అభ్యంర్ధినచాడు. స్వామివారు దేనికని అడిగగా తన భార్యకు అస్వస్థతగా ఉన్నదని, తీర్థం ఇస్తే నయమవుతుందని విన్నవించాడు ఆ బ్రాహ్మణుడు.
స్వామివారు తీర్థం ఇవ్వడానికి నిరాకరించారు. నీవు గాయత్రి మంత్ర జపము చేస్తావా? అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు నిత్యమూ చేస్తానన్నాడు. అయితే జపానంతరము నీవే తీర్థమివ్వచ్చుకదా! అన్నారు స్వామివారు. తమరిచ్చే తీర్థము, నాజప తీర్థము సమమవుతాయా స్వామి అన్నాడా బ్రాహ్మణుడు. ఎందుకు కాదు, నీవిచ్చినా నేనిచ్చినా 'గాయత్రిమంత్ర జప తీర్థమే' కదా, నీవే యిచ్చిచూడు అని చెప్పి పంపారు ఆ బ్రాహ్మణుణ్ణి.
ఒక వారం తరువాత, ఆ బ్రాహ్మణుడు స్వస్థత చేకూరిన భార్యని తీసుకుని స్వామి వారి దర్శనానికి రాగా, స్వామివారు ఆ శక్తి 'గాయత్రి మంత్ర జప తీర్థానిదే' కాని, తనదికాదని చెప్పారు. గాయత్రి మంత్ర జప విశిష్టత అది.
No comments:
Post a Comment