s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

వేదాలను వ్యతిరేకించే ఇన్ని వర్గాలు ఎందుకు ఏర్పడ్డాయి? vedas birth

వైష్ణవులు, గణాపత్యులు, కాపాలికులు, చీనమార్గరతులు, వల్కలదారులు, దిగంబరులు, బౌద్ధులు, చార్వాకులు, పాషండులు ఇలా ఎన్నో తెగలవారు వేదములందు శ్రద్ధలేని వారై ప్రవర్తిస్తూ ఉంటారు కదా! ఇందరు ఇంతమంది దేవతలను కొలుచుటకు కారణం ఏమిటి? మతిమంతులు, పండితులు, నానాతర్కములందు నేర్పరులు, వేదములందు శ్రద్ధ మాని ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవడైనా తన బుద్ధితో తన చెడ్డ కోరుకోరు కదా! ఈ భిన్నత్వమునకు కారణమేమి? అని వ్యాసుడిని జనమేజయుడు అడిగాడు.



వ్యాసుడు ఇలా చెప్పాడు.. జనమేజయా! పూర్వం ప్రాణుల కర్మవశమున పదిహేను సంవత్సరాలపాటు వానలు లేవు. ఆ అనావృష్ఠి వలన సర్వనాశనం జరిగింది. కరువులు ఎక్కువై ఇంటింటా జనులు మృతి చెందుతూ ఉన్నారు. కొందఱు ఆకలి బాధ తట్టుకోలేక గుఱ్ఱములను, ఏనుగులను, పందులను తినగా మఱికొందరు పీనుగులను పీక్కుతినేను, మఱికొందరు తల్లి బిడ్డను, భర్త భార్యను, భార్య భర్తను పీక్కుతినేను.




అప్పుడు బ్రాహ్మణులందరు బాగా అలోచించి ఈ సమయములో మహాతపస్వి యైన గౌతముడు ఒక్కడే ఈ బాధలను మాన్పగలిగినవాడు. కనుక మనమందరూ కలిసి గౌతముని ఆశ్రమము వద్దకు వెళదాం. అయన గాయత్రీ ఉపాసనాపరుడు కావడం చేత అక్కడ సుభిక్షంగా ఉన్నది. ఆచోట అనేకమంది సుఖంగా బ్రతుకుతున్నారు. అని తలచి సాగ్ని హోత్రులు గృహస్థులు అయిన విప్రులు తమతమ ఆలమందలతో దాసదాసీ జనంతో నలుదిక్కుల నుండి గౌతముని ఆశ్రమం చేరారు. గౌతముడు వారి రాకను గమనించి వారికి నమస్కరించి వచ్చినవారికి తగిన ఆసనములు ఇచ్చి గౌరవించి కుశలప్రశ్నలు అడిగి వారి రాకకు కారణం అడిగెను




. వారందఱూ తమతమ కష్టములు చెప్పుకొనగా వారందరికీ అభయమిచ్చి "ఇది మీ ఇల్లు, నేను మీదాసుడను. మీదాసుడైన నేనుండగా మీకీ విచారం ఎందుకు? తపోధనులైన మీరాక వలన చెడు సైతం మంచిగా మారగలదు. మీ అందరి పాదధూళి చేత నా గృహం పావనమైనది. మీరందఱూ సంధ్యాజప పరాయణులై ఇక్కడే సుఖంగా ఉండండి. అని వారందరినీ ఊరడించాడు.
అనంతరం గాయత్రీ దేవి భక్తి పరాయణుడై గాయత్రిని ప్రార్ధించాడు.




 వేదమాత! పరాత్పరా! మహా విద్యా!. ప్రణవ స్వరూపిణి! సకలార్ధ ప్రదాయిని! విశ్వరూపిణి! సచ్చిదానంద స్వరూపిణి! సర్వవేదాంత వేద్య, సూర్యమండలం నివాసిని!ఉదయమున రక్తవర్ణవు, బాలవు, మధ్యాహ్నమున నవయువతివి! సాయంకాలమున కృష్ణ వర్ణవు-వృద్ధవు! నిత్యమూ నీకు శతకోటి నమస్సులు! సకల ప్రాణులను తరింపజేయు పరమేశ్వరీ నా అపరాధములు క్షమింపుము. అని స్తుతించగా విని గాయత్రీదేవి ప్రత్యక్షమై ఒక అక్షయ పాత్ర ఇచ్చి "ఈపాత్ర ఎందరినైనా పోషించగలదు. గౌతమా!నీవు కోరినదెల్లా ఈపాత్ర నీకు ఈయగలదు. అటువంటి పాత్రను నీకు ఒసంగితిని" అని చెప్పి పరమ కళ యగు గాయత్రీదేవి అదృశ్యమయ్యెను.





అప్పుడు ఆపాత్ర నుండి అన్నము, షడ్రసములైన పదార్ధములు, పలురకములైన పాత్రలు, వస్త్రములు, ఆభరణములు రాసులు రాసులుగా వెలువడ్డాయి. గౌతముడు ఏది అడిగినా అడిగిన ప్రతి వస్తువు ఆపాత్ర నుండి ప్రత్యక్షమైంది. అంతట గౌతమ మహర్షి అందరిని పిలిచి ధనకనక వస్తు వాహనములు, వస్త్రములు, ఆభరణములు, సొమ్ములు ప్రదానము చేసాడు.



ఇంతెందుకు! గొఱ్ఱెలు, బఱ్ఱెలు, గోవులు పశువులు, యజ్ఞ పరికరములైన స్రుక్కు స్రువములు కూడా వచ్చాయి. ముల్లోకములందు ఏయే వస్తువులు గలవో అన్ని ఆ పాత్ర నుండి వచ్చాయి. దీంతో గౌతముడు యజ్ఞం చేయతలచి అందరిని ఆహ్వానించి యజ్ఞ విషయం చెప్పగా అందరూ కలిసి యజ్ఞం ఆరంభించారు. స్త్రీలు దివ్యాభరణములు ధరించి దేవతాస్త్రీల వలె అలరారారు. పురుషులు వస్త్రములు ఆభరణములు దాల్చి దేవతల వలె వెలుగొందారు. ఈవిధంగా గౌతమయుని ఆశ్రమం నందు నిత్యోత్సవములు జరుగుతూ ఉన్నాయి.




అక్కడ రోగభయము కాని మృత్యు భయము గాని దైత్య భయము కానీ మచ్చుకకైనా లేదు. ఈవిధంగా ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చేవారితో గౌతమముని ఆశ్రమం నూరు ఆమడల దూరం వరకు వ్యాపించింది. గౌతముడు వచ్చినవారందరికీ అభయమిచ్చి పోషిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఎన్నో విధములైన మహాయజ్ఞాలు చేశాడు. అందఱు గౌతముడిని వేయినోళ్ల పొగిడారు. ఇంద్రుడు సైతం ఇంద్రసభలో గౌతముడ్ని ప్రశంసించాడు.
ఆహా! గౌతముడు ఇప్పుడు మాకు మహాకల్ప వృక్షం వంటివాడు అయ్యాడు.





అతడు కీర్తిమంతుడై మా కోరికలు తీర్చుతున్నాడు. గౌతముడే లేనిచో మాకీ యజ్ఞముల యందు హవిర్భాగములు ఎక్కడివి? గౌతముడు ఎల్లవారిని కన్నబిడ్డల వలె పోషిస్తున్నాడు అంటూ కీర్తించాడు. గౌతముడు తన ఆశ్రమమును గాయత్రీ పీఠముగా మార్చాడు. ఆనాటి నుండి మునులందరూ గాయత్రీదేవిని పూజిస్తూ ఉన్నారు. అచ్చట నేటికీ గాయత్రీ ఉదయం బాలగా, మధ్యాహ్నం యవ్వనవతిగా, సాయంకాలం వృద్ధగా దర్శనం ఇస్తుంది.




ఒకనాడు నారదుడు వీణను మీటుకుంటూ గాయత్రీ జపం చేసుకుంటూ గౌతముని ఆశ్రమం వద్దకు రాగా గౌతముడు నారద మహర్షిని ఆహ్వానించి తగిన రీతిలో గౌరవించి ఆసనమివ్వగా నారదుడు సంతోషించి గౌతమ మహర్షిని కొనియాడి "మహర్షి! నీకీర్తి దిగంతాలవరకు వ్యాపించింది. దేవేంద్రుడు సైతం నిన్ను కీర్తించగా చూడవలెననే వేడుకతో ఇచ్చటికి వచ్చాను. గాయత్రీ వరప్రసాదమున నీవు ధన్యుడవైతివి. అని నారదుడు గౌతముడిని పొగిడి గాయత్రీ ఉన్నచోటికి వెళ్లి ప్రణమిల్లి ప్రేమభక్తితో పెల్లుబికిన హృదయంతో దేవిని సందర్శించాడు.





 పలురీతిగా స్తుతించి స్వర్గానికి వెళ్ళాడు. ఈవిధముగా గాయత్రీ దయవలన గౌతముడు మునులందరినీ పోషించగా గౌతముని కీర్తి ప్రతిష్ఠలు వినివిని మునులందరూ అసూయ చెందారు. కీర్తిని వమ్ముచేయాలని తలచారు. సమయం వచ్చినపుడు చూసుకుందామని వేచి ఉండగా కొంతకాలానికి వర్షాలు పడ్డాయి.అడవులు దేశములు పాడిపంటలతో పచ్చని పైరుతో కళకళలాడాయి. అదివిని బ్రాహ్మణులందరు ఒకచోట గుమిగూడారు.





వారందఱు అన్నం పెట్టిన గౌతమ మహర్షికి చెడు చేయడానికి పూనుకొన్నారు. ఇలాంటి కొడుకులని కన్న తల్లిదండ్రులని ఏమనాలి? కాలం ఇలాంటిది అని తెలుపడం ఎవరికీ సఖ్యం వ`అవుతుంది? వారందరూ చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఎద్దుని సృష్టించి గౌతముడు యజ్ఞం చేసే సమయానికి అది యాగశాలలోకి వచ్చేలా చేసారు. అప్పుడు గౌతముడు గోవు రావడం చూసి హుంకారం చేసాడు. ఆ హుంకార శబ్దానికి గోవు మరణించింది.
అయ్యో! దుష్ఠుడు గోవుని చంపేనే! అని వారందఱు గౌతముడిని నిందిస్తూ ఉండగా గౌతముడు యజ్ఞమును ఆపివేసి దీనంతటికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి సమాధి స్థితిలోకి వెళ్ళాడు. జరిగిన విషయం గ్రహించి దీనంతటికీ కారణం బ్రాహ్మణులు పన్నిన పన్నాగమే అని యెరిగి ప్రళయకాల రుద్రుల వలె కన్నులు ఎఱ్ఱజేసి ఈవిధంగా శపించాడు.






బ్రాహ్మణాధములారా! మీరు వేదమాత అగు గాయత్రీ ధ్యానం మానివేతురు గాక! గాయత్రీ మాతను వదలడం వలన మీరు బ్రాహ్మణాధములు అగుదురు గాక! వేదముల యందును, యజ్ఞముల యందును, వేద వార్తల యందును విముఖులగుదురు గాక! శివుని యందు, శివ మంత్రము నందు, శివశాస్త్రముల యందు విముఖులు అగుదురు గాక! మీరు మూల ప్రకృతి యైన శ్రీదేవి ధ్యానమునందు - కథల యందు విముఖులై యుందురు గాక! శ్రీదేవి మంత్రము అనుష్ఠానము నందు విముఖులై బ్రాహ్మణాధములు అగుదురుగాక!





శ్రీదేవి మహోత్సవములు, శ్రీదేవీ దివ్యనామములు కీర్తించుటకు మీరు నోచకుందురు గాక! శ్రీదేవి భక్తిని, దేవీపూజలను నిందించువారు అగుదురు గాక! శివమహోత్సవములు దర్శించు వేడుకను, శివ భక్తులను సత్కరించు కోరికయును మీకు కలగకుండు గాక! రుద్రాక్షలు, మారేడు, భస్మము నందు మీకు ప్రీతి కలుగకుండు గాక! అద్వైత మార్గమునందు, జ్ఞానమందు శాంతి దాంతుల యందు నిష్ఠలేని నికృష్ఠ జీవులగు బ్రాహ్మణ భ్రష్ఠులై తిరుగుదురు గాక!






వేద పఠనము - స్వాధ్యాయము - నిత్యకర్మానుష్టానము - అగ్నికార్యము - ప్రవచనము నందు విముఖులై కర్మ భ్రష్ఠులు అగుదురు గాక! గోదానము - పితృ శ్రర్ధ కర్మలు - చేయుటకు ఇష్టపడని నికృష్ట జీవులగుదురు గాక! కృచ్ఛము - చంద్రాయణము - ప్రాయశ్చిత్తము చేయని దురాచారులై అధములై యుందురు గాక! గాయత్రీ మాతను వదిలిపెట్టి ఇతర దేవతలను కొలిచి శంఖ చక్రములు దాల్చు బ్రాహ్మణాధములై చెడుదురు గాక!





తల్లిదండ్రులను, కన్నబిడ్డలను, సోదరులను, భార్యను అమ్ముకొని బ్రతుకు బ్రాహ్మణాధములు అగుదురు గాక!వేదమును - తీర్థమును, ధర్మమును, నామ సంకీర్తనమును అమ్ముకొను బ్రాహ్మణాధములు అగుదురు గాక! పాంచరాత్రములు - కామశాస్త్రము - బౌద్దము - కాపాలికము - పాషండ మున్నగు మతము లందు ఆసక్తులై బ్రాహ్మణాధములు అగుదురు గాక!




తల్లి, కన్య - సోదరి మొదలగు వారితో వావివరసలు లేక కలయునట్టి నీచ్య బ్రాహ్మణాధములు అగుదురు గాక! మీరే కాక మీమీ వంశము నందలి స్త్రీ పురుషులు నా శాపాగ్నికి దగ్ధులగుదురు గాక! నేను ఇంతగా చెప్పనేల! ఆ మూల ప్రక్రుతి యైన గాయత్రీ మిమ్ములను కోపించి యుండును మీరు అంధకూపము మున్నగు నరకములందు పతితులు అగుదురు గాక! ఈ విధముగా గౌతముడు శాపమిచ్చి నీటిని తాకాడు. పిదప గౌతమును గాయత్రీ మాత దర్శనం కోసం  బయలుదేరి మహాదేవిని చేరి ప్రణమిల్లారు.





గాయత్రీదేవి బ్రాహ్మణులూ చేసిన దురాచారానికి విస్మయము చెందినది. (ఇప్పటివరకు కూడా గాయత్రీ ముఖము ఇలాగే ఉన్నది).. గాయత్రీదేవి చిరునవ్వులు చిందు ముఖకమలముతో గౌతమా! పాముకు పాలు పోసిన విషమగును. నీవు ఇప్పుడు శాంతించుము. కర్మగతి ఇటులనే ఉందును. దేవివాక్కులు విన్న గౌతముడు తన ఆశ్రమమునకు వెళ్ళాడు. పశ్చాత్తాప పడ్డారు. గౌతమ మహర్షికి సాష్టాంగపడి సిగ్గుతో దించినతల ఎత్తకుండా అలాగే ఉండిపోయారు. అందఱు గౌతమముని చుట్టూ చేరి ప్రసన్నుడవు కమ్మని పలుమార్లు ప్రార్ధించారు.





అంతట గౌతముని శాపము వలన బ్రాహ్మణులు వేదములు మరచిపోయారు. వారికి గాయత్రీ మంత్రము స్ఫురించడం లేదు. ఇదంతా ఎదో వింతగా తోచింది. శాపగ్రస్తులు అయిన బ్రాహ్మణులు గౌతముడి చుట్టూ చేరి సాగిలపడి మ్రొక్కి ప్రసన్నుడవు కమ్మని పలుమార్లు ప్రార్ధించారు. తుట్టతుదకు గౌతముడి మనస్సు కరిగి "మీరందఱు శ్రీకృష్ణావతారము వరకు కుంభీపాక నరకమున ఉండండి. మరియు కలియుగమున జన్మించగలరు. అప్పుడు నేను ఇచ్చిన శాపములన్నియు జరిగితీరును. ఇది నిజాము. నామాటకు తిరుగులేదు. కానీ శాపము నుండి విముక్తి పొందదలచినచో మీరు గాయత్రీదేవి పాద కమలములు సేవించండి. అని పలికి గౌతముడు వారిని విడిచి "ఇదంతా ప్రారబ్ద కర్మ"యని తలచి శాంతచిత్తుడు అయ్యాడు.






ఆకారణం చేత శ్రీకృష్ణుడు అవతారం చాలించగానే కుంభీపాక నరకము నుండి బయటికి వచ్చారు. ముని శాపమునకు దగ్దులు అయినవారే ఇప్పుడు "త్రికాల సంధ్యావందను -గాయత్రి జపరతి లేని అధమాధములైన బ్రాహ్మణులుగా జన్మించారు. వారే వేద తెలియనివారు, భక్తి రహితులు, పాషండ మతస్థులు, అగ్నిహోత్రాది కర్మరహితులు స్వాహా-స్వధా రహితులు అయ్యారు. వారిలో ఒక్కడైనా మూలప్రకృతి స్వరూపము ఎఱిగినవాడు లేడు. వారిలో కొందఱు తప్తముద్రలు వేయించుకున్నారు. కొందఱు కామాచారాపరులయ్యారు. మరికొందరు మహాపండితులు అయినా కాపాలికులు కౌలికులు-బౌద్ధులు-జైనులు-దురాచార - పాషండ వర్తనులు అయ్యారు. వారే పరాధారా వంపుసొంపుల యందు చిక్కుకున్న చిత్తము కలవారు దురాచార వర్తనులు అయ్యారు. కనుక వారు మరల తమతమ చెడు వర్తనల వలన చెడుకర్మల పరిపాకము వలన కుంభీపాక నరకము నందు కూలతారు. విష్ణూపాసన, శివోపాసన నిత్యములు కావు. శ్రీగాయత్రి ఉపాసనే నిత్యోపాసన. నీవు మాత్రం సర్వాత్మభావముతో శ్రీపరమేశ్వరినే సేవింపుము.. అని జనమేజయునకు వ్యాసుడు తెలియజేశాడు.....





తిండిలేక జనాన్ని పీక్కుతినే పరిస్థితులలో వచ్చినవారు కడుపు నిండగానే ఎలా మారిపోయారో చూశారా? అన్నం పెట్టినవాడినే నాశనం చేయాలని చూడడం ఎంతటి ఘోరం.. ఈ కథ చదివితే ఈ కలియుగంలో ఈజనం ఎందుకు ఇలా ఉన్నారో! అర్థమౌతుంది. ఎందుకు ఇన్ని వర్గాలు (మతాలు అంటున్నాం మనం.. కానీ మతం అనకూడదు. వర్గం లేదా తెగ అనాలి.)..ఉన్నాయో తెలుస్తుంది. మనం చూసే అన్యమతాలు ఎలా ఏర్పడ్డాయో చూసారు కదా! కనుక ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారికే కోపం తెప్పిస్తే ఎలా?





గమనిక : ఇది చదివి ఒక వర్గం మీద ద్వేషం పెంచుకోమని చెప్పడంలేదు సుమా! ఈర్ష్య పడితే ఎంతటి ప్రమాదం సంభవిస్తుందో తెలుసుకొని ఈర్ష్య చెందడం మానండి. అంతేతప్ప బ్రాహ్మణ ద్వేషం ఎప్పటికీ మంచిదికాదు. తరతరాలు వెంటాడతాయి. చేసిన అపరాధానికి తరతరాలు భ్రష్టం అయిపోయాయి. వీరికి ఇప్పట్లో విముక్తి లేదు. ఉండదు. ఉంటుంది కాని వీళ్ళని వీళ్ళు తెలుసుకోవాలి. శాప ప్రాభవం చేత చెప్పినా వినరు. మనం చూస్తూనే ఉన్నాం కదా!
దేవీభాగవతం - ద్వాదశ స్కంధం..

యజ్ఞాలు ఎందుకు చేయాలి? యజ్ఞాలు చేయడం దేవతలకి తృప్తి కలిగించడం కోసమా? లేక మన కోర్కెలు తీర్చుకోవడం కోసమా? uses of yagnam prayers

యజ్ఞం వలన దేహం శుద్ధి జరుగుతుంది. యజ్ఞం వలన అనేక రోగాలు తొలగిపోతాయి. యజ్ఞం వలన ఆయుష్షు పెరుగుతుంది. యజ్ఞం వలన శుభాలు కలుగుతాయి. యజ్ఞాల వలన భూత శాంతి కలుగుతుంది. యజ్ఞాల వలన వర్షము కురుస్తుంది. యజ్ఞంతో చేయలేని, అవ్వని పనిలేదు. యజ్ఞంతో ఏదైనా సాధించవచ్చు. ఇలా చెబితే ఎవరూ నమ్మరు. పైగా ఇది కలికాలం కావడం చేత వితండవాదం ఎక్కువగా ఉంటుంది. పనికిరాని భూతదయ, దయ జాలి స్థాయిని మించి అధికంగా ఉంటాయి. 25ఇవ్వవలసిన చోట 1000 ఇవ్వడానికి కూడా వెనుకాడరు. వెయ్యి ఇవ్వవలసిన చోట 100ఇవ్వడానికి ఏడుస్తారు.





యజ్ఞం అంటే కేవలం నెయ్యి, చితుకులు వేసి వ్రేల్చడం కాదు. యజ్ఞం అంటే అవసరం కోసం చేసేదీ కాదు. చూడడానికి అన్ని యజ్ఞాలు ఒకేలా కనబడినా ఒక్కో యజ్ఞం వలన ఒక్కొక్క ఫలం ఉంటుంది. యజ్ఞములలో వాడే సమిధలు వేరుగా ఉంటాయి. 






ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, వివాహం కోసం, సంతానం కోసం, స్నేహం కోసం, మళ్ళి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క యజ్ఞం ఉంటుంది. క్షయ కి ఒకటి, కుష్ఠుకి ఒకటి, రాజ యాక్ష్మం కోసం ఒకటి, జ్వరం కోసం ఒకటి ఇలా రకరకాలుగా ఉంటాయి. కోర్కెల తీరడం కోసం ఒకటి, ఇంట్లో ఉండే దోషాలు పోవడం కోసం, నరదృష్టి సోకకుండా ఒకటి, ఆలా చెప్పుకుంటూ పొతే ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. 




పూర్వం రాజులు వేలకొలది సంవత్సరాలు బ్రతికేవారు, మునుల సంగతి చెప్పేపనిలేదు. కోటాను కోట్ల సంవత్సరాలుగా జీవిస్తున్నవారు ఇప్పటికీ ఉన్నారు. యజ్ఞం చేస్తే దేవతలు ఆహ్వానించబడతారు అనేది నిజమే అయినప్పటికీ దేవతలు వస్తారా? అనే సందేహం కొందరిది. అన్ని కంటికి కనబడితేనే నమ్ముతాం అంటే కష్టం. నీ ఒంటికి రోగం వచ్చినప్పుడు నీకు శరీరం మీద స్పృహ ఉంది కనుక ఫలానా రోగం వచ్చింది 



అని చెప్పగలుగుతున్నావు. మరి స్పృహ లేనివారి సంగతి ఏంటి? స్పృహ ఉండికూడా వారికి వచ్చిన సమస్యను సరిగ్గా చెప్పలేనివారు కోకొల్లలు. ఇలా నీశరీరం గురించే నీకు అవగాహన లేనప్పుడు దేవతలు రారు, లేరు అని నువ్వు ఎలా చెప్పగలవు? రోగికి వైద్యం చేస్తే అతనికి వచ్చిన బాధ తగ్గుతుంది కనుక మందు పని  అంటున్నావు. కానీ ఆ మందు ఎలా నీశరీరంలోకి వెళ్లి పని చేస్తుందో చూడగలవా?




ఆయుర్వేదానికి యజ్ఞానికి కూడా చాల సంబంధాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యలో కొన్ని మ్రింగాలి, కొన్ని త్రాగాలి, కొన్ని శరీరానికి రుద్దాలి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఏ వైద్యం అయినా శరీరం పైనో లోపలో చేయాల్సిందే.
యజ్ఞం చేసినప్పుడు వాటిలో వేసే పదార్ధాలను బట్టి యజ్ఞ ధూపం పీల్చడం మనకి ఉన్న అనేక సమస్యలు తొలగించవచ్చు



. ఉదాహరణకి యజ్ఞాలలో వాడే ఆవు నెయ్యి వలన, ఆవు పేడ వలన, పెరుగు, వెన్న వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రోగాలని ఇట్టే నయం చేస్తాయి. ఇక మారేడు దళాలు, మారేడు కట్టెలు, తులసి, రావి, వేప, కదంబం, ఇలాంటివి మనకి తెలియని ఎన్నో చెట్లు మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేవే.. వీటిలో కొన్నిటిని కలిపితే కొన్ని రోగాలు, కొన్నిటిని కలిపి యజ్ఞం చేస్తే కొన్ని సమస్యలు, కొన్నిటిని కలిపి యజ్ఞం చేస్తే భూత శాంతి, కొన్ని కలిపి యజ్ఞం చేస్తే మనశ్శాంతి కలుగుతాయి. కేవలం ఈ యజ్ఞాలలో నెయ్యి, పంచగవ్యంలో వేసి వ్రేల్చడం ఆ ధూపం పీల్చడం తోనే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.






మనిషి ఆయుష్షు పెంచడం కోసం మనం ఎన్నో ప్రయోగాలు చేసి చివరికి చేతులు ఎత్తేసి 110ఏళ్ల కంటే బ్రతకడం కష్టం అంటున్నారు. పైగా వృద్ధాప్యాన్ని పారద్రోలలేరు. శరీరం ముడతలు పడి దుర్వాసనలు వచ్చి అందరూ విసుక్కుంటూ ఉండగా 110ఏళ్ళు ఎవడు బ్రతకాలి అనుకుంటాడు? ఎప్పుడు చద్దామా అని చూస్తూ నెట్టుకెళ్తారు. అదికూడా ఇంట్లో ఉన్నవాళ్లు చంపకపోతే.. ! యజ్ఞం ద్వారా ఆరోగ్యం ఆయుష్షు రెండు పొందవచ్చు. ఇది తిరుగులేదు. చావుని కూడా ఆపేయవచ్చు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే చావు. ఇలా మన శాస్త్రాలు ఎన్నో రహస్యాలు మనిషికి భోధించాయి.




అయితే మనిషి యాంత్రికంగా ఎదుగుతూ శాస్త్రాలని అవమానించడం, నమ్మకపోవడం, వారి పూర్వికులు ఇలాంటివి తెలియజెప్పక పోవడం, బహుశా వారికే తెలియకపోయి ఉండవచ్చు.. కారణం ఏదైనా బ్రాహ్మణ ద్వేషం, శాస్త్రం మీద నమ్మకం లేకపోవడం, మూర్ఖపు వాదనలకు దిగడం, మూర్ఖత్వం ఇలాంటి ఎన్నో కారణాల చేత వీటన్నిటికీ మనిషి దూరమయ్యాడు. విషయలోలుడు అయ్యాడు.







 భోగం అనుభవించడమే యోగం అనే స్థాయికి దిగజారిపోయాడు. పైపెచ్చు రాక్షసులు మానవ రూపాలలో తిరుగుతూ ఉండడం వలన శాస్త్రం తెలుసుకోవాలి అనుకునేవారికి ఎన్నో ఆటంకాలు కల్పించడం, మనస్సులో ప్రవేశించి అటుగా ప్రయత్నించడకుండా అడ్డుపడడం ఇలా అనేకానేక కారణాల వలన మనిషి యజ్ఞాలకి దూరమైపోయాడు. ఆయుష్షు తగ్గించుకుంటున్నారు. రోగాలు కొని మరీ తెచ్చుకుంటున్నారు.

నీ కులంలో గొప్పవాడు పుడితే! గాంధి పేరు నీ పేరులో ఉంటే! శ్రీకృష్ణుడు మహానుభావుడు... great castisam

సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణుడు అండగా ఉండగా సర్వభూమండలాన్ని గెలిచి పరిపాలించిన ధర్మరాజు వంశంలో పరిక్షీత్ పుట్టాడు. పాముకాటుకి బలయ్యాడు. జనమేజయుడు పుట్టాడు, తండ్రికి జరిగిన పరాభవానికి సర్పయాగం చేసి ఋణం తీరుచుకున్నాడు.






పాముల జాతి అంతా ఎక్కడ నాశనం అవుతుందేమో అని ఆస్థికుడిని పంపించి యజ్ఞం ఆపించారు దేవతలు. యజ్ఞం మధ్యలో ఆగిన అనంతరం జనమేజయుడు మహాభారత గ్రంథం మనకి అందేలా చేశాడు. జనమేజయుడి తరువాత అతని సంతానం, అతని వంశ పురుషులు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఎవరికీ ఆవాహన లేదు. కౌరవులు పిల్లలతో సహా సర్వనాశనం అయిపోయారు. కాని ఒక్కడు మిగిలాడు. అతను ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలీదు. అతడి తరువాత తరం మాట అదో తెలియని ప్రశ్న..





నీకులంలో గొప్పవాళ్ళు పుడితే నువ్వు గొప్పవాడివి కాదు,
నీకులంలో ధర్మరాజు పుడితే నువ్వు ధర్మరాజు కాలేవు, నీకులంలో ఓ మహానుభావుడు పుట్టినంత మాత్రం చేత నువ్వు మహానుభావుడివి అవ్వవు. గాంధి పేరు పెట్టుకున్న వారందరూ మహాత్ములు కాలేరు, గాడ్సే పేరు పెట్టుకున్నంత మాత్రం చేత హత్యలు చేయరు.




ఇక్కడ ఎవడి అర్హత వాడిదే. ఎవడి గొప్ప వాడిదే! ఒక విషయంలో విజయం సాధించినంత మాత్రం చేత జీవితకాలం ఆవిజయం నీ వెంట ఉండదు. మరుక్షణంలోనే వేరొక విజయం కోసం పరుగులు పెట్టాల్సిందే.
టీం ఇండియా చారిత్రాత్మ విజయం సాధిస్తే అది అప్పటికే పరిమితం, మళ్ళి అడల్సిందే గెలవాల్సిందే.
ఒకసారి గెలిచి 100 సంవత్సరాలు చెప్పుకోవడానికి జనానికి గుర్తుండదు. అనుక్షణం నీ గెలుపునే అడుగుతారు, ఓడితే తిడతారు.



ఎప్పుడు ఓడేవాడు విజయం వస్తే సంబరం చేసుకోవచ్చేమో కాని ఎప్పుడూ విజయం సాధించేవాడు ఓడిపోతే తట్టుకోలేడు. గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు అయినా తొక్కుతాడు. అదే ఓడే వాడికి గెలిచేవాడికి తేడా!
ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకోవలసిందే.. ధర్మరాజు అంత అవసరంలేదు.


 కనీసం నీముందు నీతరువాతి తరాలకైన తెలిసేలా ఉండాలి. అంతేతప్ప కులాల కుమ్ములాటలతో, మత పిచ్చితో అల్లరి కాకూడదు.








ఒకప్పుడు ఎవరైనా కులం కాని కులంవారు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తాళి మెడలో పడడమే ఆలస్యం "నాకూతురు చచ్చిపోయింది" అనుకొని వదిలేసేవారు. కొన్నాళ్ళకి అహం దిగాక మళ్ళి కలుసుకొనే వారు. ఈరోజుల్లో ఆపరిస్థితి కనబడడం లేదు. కులపరువు కోసం తాళి కట్టినా, కట్టించుకున్నా నిర్దాక్షిణ్యంగా కూతురు కొడుకు అనే తేడా లేకుండా చంపేస్తున్నారు. అంతలా మారిపోయింది కులపిచ్చి..

ఏ రుద్రాక్ష ధరిస్తే ఏ ఫలితం లభిస్తుంది? rudraksha miracles



ఏ రుద్రాక్ష ధరిస్తే ఏ ఫలితం లభిస్తుంది?

                 . శివుడుని షణ్ముఖుడు రుద్రాక్షల మహిమ అడుగగా తెపిలిన రుద్రాక్ష మహిమ..   జప సాధకుడు యధావిధిగా భస్మమును, రుద్రాక్షలు ధరించవలయును. కంఠమున ముప్పది రెండు (32), తలపై నలుబది(40), చెవులకు ఆరేసి చొప్పున ప్రతి చేతియందు పండ్రెండేసి(12) చొప్పున, ప్రతి భుజము నందు పదహారు వంతున నేత్రములకు ఒక్కొక్కటి చొప్పున, జుట్టు యందు ఒకటి, రొమ్ముపై నూట ఎనిమిది దాల్చువాడు కేవలం నీలకాంఠుడై పరమశివుడే అగును.



ఏకముఖి రుద్రాక్ష : సాక్షాత్తు శివుడే. బ్రహ్మహత్యా పాతకములు పోగొట్టును.
ద్విముఖి :  శివ స్వరూపము. సకల పాతకములు అణచివేయును.
 త్రిముఖి  : అగ్ని స్వరూపము; క్షణములో స్త్రీహత్యా దోషమును హరించివేయును.




చతుర్ముఖి  : బ్రహ్మస్వరూపము;నరకహత్యా దోషమును బాపును.
పంచ ముఖి : కాలాగ్ని; తినరానివి తినుట, పోరాని చోట్లకు పోవుట వలన గలుగు పాపములను తుడిచిపెట్టివేయును. ఈపంచముఖి రుద్రాక్ష దాల్చుట వలన సర్వపాపములు సమసిపోవును.
షణ్ముఖములు : ఇది షణ్ముఖుడు. దీనిని కుడిచేతి యందు ధరింపవలయును.అటుల దాల్చుట వలన అది బ్రహ్మహత్యా పాపములు పోగొట్టును. సందేహించరాదు.




సప్త ముఖాములు : అనంగ రూపమైనది; ఇది సౌభాగ్యవంతమైనది. దీనిని ధరించుట వలన బంగారము దొంగతనం చేసిన పాపము పోగొట్టును.
 అష్ట ముఖములు: సాక్షాత్తు వినాయకుడే; దీనిని దాల్చుట వలన అన్న వస్త్ర సువర్ణములకు లోపము కలుగదు. కులము గాని స్త్రీని, గురుపత్నిని తాకిన పాపమును, ఇతర పాపములను మొత్తము దీనిని దాల్చుట వలన నశించగలవు.


నవ ముఖములు : ఇది భైరవము; దీనిని ఎడమ భుజముపై దల్చవలయును.భుక్తి-ముక్తి కలిగించగలదు. అది నారాయణుడి అంత బలము గలది. వేల బ్రాహ్మణ హత్యలు, నూరు బ్రహ్మహత్యలు, నవ ముఖ రుద్రాక్ష దాల్చుటవలన వెంటనే నశించిపోగలవు







దశ ముఖములు : సాక్షాత్తు దేవేశుడైన జనార్దనుడే; గ్రహ, పిశాచ, భేతాళ, బ్రహ్మరాక్షస, పన్నగముల (సర్పముల) వలన బాధలన్నియు తొలగిపోవును.
ఏకాదశముఖములు: రుద్రుడే; దీనిని తలపైదాల్చువాని పుణ్యము అనంతము. వేయి అశ్వమేధములు, నూరు వాజిపేయ యాగములు, పదివేల గోదానములు చేసినంత పుణ్యము. శీఘ్రముగా ఏకాదశ రుద్రాక్ష దాల్చుట వలన ఇవి కలిగి తీరును.


 ద్వాదశ ముఖములు : చెవియందు దాల్చవలెను. దాని వలన నిత్యమూ ద్వాదశాదిత్యులు ప్రసన్నులగుదురు. అశ్వమేధ – గోమేధ ఫలములు లభించును.పశువుల, శాస్త్రముల, పులుల వలన ఎటువంటి భయము కలగదు. ఆదివ్యాధులు కలుగవు. ఎటువంటి భయము, వ్యాధులు కలుగవు. ముమ్మాటికి భయములేదు. అతడు సఖి – ఈశ్వరుడే యగును. ఏనుగు గుఱ్ఱము, జింక, కుక్క, నక్క, పిల్లిం ఎలుక,గాడిద, దుర్దురము మున్నగు జీవులను చంపినా వానియును ద్వాదశ రుద్రాక్ష దాల్చుట వలన తొలగును. పాపవిముక్తుడు అగును. సందేహములేదు.


త్రయోదశ ముఖములు : అది లభించినచో కార్తికేయునితో సమానము. సకలార్ధ సాధకము. అతనికి ఎల్ల రసములు-రసాయనములు సిద్ధించును. ఎల్లా భోగవస్తువులు అనుభవింపగలడు.
చతుర్దశ ముఖములు : ఇది లభించుట కష్టము.దీనిని తలపై ధరింపవలయును. అతడు సదా శివస్వరూపుడవును. మాటిమాటికి చెప్పనేల! అతడు దేవపూజ్యుడు అగును. పరమగతి నోన్దగలడు. ద్విజుడు ఒకే రుద్రాక్షను శిరస్సుపై దాల్చవలయును.





26 రుద్రాక్షల మాలిక శిరస్సుపై, యాబది ఆరు రుద్రాక్షల మాలిక హృదయముపై, పదహారు రుద్రాక్షల మాలిక భుజములపై, పండ్రెండు రుద్రాక్షల మాలిక మణిబంధముల యందు, నూట ఎనిమిది రుద్రాక్షల మాల గాని, ఏబది రుద్రాక్షల మాలగాని, ఇరువది ఏడు రుద్రాక్షల మాలికగాని, ధరించినచో లేక దానితో జపించినచో అతనికి అనంత ఫలములబ్బును. నూట ఎనిమిది రుద్రాక్షల మాలిక ధరించినవాడు క్షణక్షణమశ్వేమేద ఫలములు పొందగలడు. అతడు 21 తరముల వారిని ఉద్ధరించి శివలోకము నందు నివశించగలడు.





  దేవి భాగవతం దశమ స్కంధం : రుద్రాక్ష మహిమ.

శివరాత్రి అంటే ఏమిటి ? శివరాత్రి పూజావిధానం ఎలా? శివరాత్రులు ఎన్ని? what is shivratri?shiv pooja ,,howmany shivratris

 ( పూర్తిగా చదవడానికి సమయం ఎక్కువ అయినా పర్వాలేదు శివరాత్రి పండుగ విశిష్టత ఏమిటో పూర్తిగా తెలుసుకోండి సంవత్సరానికి ఒక్క సారే అయినా మనిషి కి జన్మ లో అరుదైన రాత్రి శివరాత్రి తప్పక ఆచరణ చేయండి )
వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం.పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.
శివరాత్రులు ఎన్ని?





శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి : నిత్య శివరాత్రి, పక్షశివరాత్రి, మాసశివరాత్రి, మహాశివరాత్రి, యోగశివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి, అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు



.
లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు, జ్యోతిరూపంలో, లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి, మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు, పురుషులు కూడా ఆచరించదగినదే.






 ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు.
ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ, శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.






మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటకీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.







ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో యిష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని, రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. “రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి” అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది – హే రాత్రే! అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక!





… వగైరా –
‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!
ఉష ఋణేవ యాతయ||’
నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో, ఆ త్రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.







‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’
అందుకేనేమో గరుడ, స్కంద, పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసంచేసి, బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని, ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో ‘అభ్యుదయ ‘ మని, ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని, అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ, శాస్త్ర విహిత నియమాది, సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.







మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని ‘తిథితత్వం' లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – ‘ మీరు స్నానం చేసినా, మంచి వస్త్రాలు ధరించినా, ధూపాలు వెలిగించినా, పూజ చేసినా పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం' అంటాడు శివుడు.
ఉపవాసం అంటే ఏమిటి?






దగ్గర వసించటం, నివశించటం, ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.
‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)
భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.
‘ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!
ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||’







మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత, శక్తులు, శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. ‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ, సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.
‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ
యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘








విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.
శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి, వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!”









వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ‘ఓం నమః శివాయ ‘ అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు, బియ్యము, నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన  శివకథలు వినవచ్చు. వ్రతలు మరొకసారి రథరాత్రి మూడవ, నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ ‘ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – 'పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా! శివ – భవా! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా, మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.





అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర, ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి, అవకాశం లేకపోతే, ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో, బిల్వదళాలతో అర్చించాలనీ, శక్తికొలదీ పాలు, గంగోదకం, పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ, ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.






శివరాత్రికి లొంగోద్భవకాలమని కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యొతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం . ఆ రోజు  అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ, మనసునూ కూడా శివార్పితం, శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు 'బిల్వ' మూలంలో ఉంటాయనీ, శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. 






కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం, ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం, వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు. శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.







ప్రదక్షణ విధులు…
శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.







బిల్వ దళం ప్రాముఖ్యత:
బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది.ఇందులో కుడి ఎడమలు విష్ణు, బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శి వప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ.బిల్వం ఇంటి అవ రణం లోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం, గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.

*సీసిరో * , తత్వవేత్త ,* క్రీ।।పూ।। 43 లో * ఇలా ఉటంకించారు :poltical power

1. పేదలు శ్రమ చేస్తూనే ఉంటారు.
2. ధనికులు వారిని వాడుకుంటారు. 


3.సైనికుడు పై ఇద్దరినీ రక్షిస్తుంటాడు.
4.పన్ను కట్టేవాడు, పై ముగ్గురుకీ కడుతుంటాడు.










5.తిరుగుబోతు, పై నలుగురి బదులుగా
విశ్రాంతి తీసుకుంటాడు. 



6.తాగుబోతు పై ఐదుగురి కోసం తాగుతుంటాడు.
7. ధనాగార నిర్వాహకుడు పై ఆరుగురిని
దోపిడి చేస్తుంటాడు.
8. న్యాయవాది , పై ఏడుమందిని తప్పు త్రోవ
పట్టిస్తుంటాడు . 



9. వైద్యుడు, పై ఎనిమిది మంది నుంచి
డబ్బు తీసుకుంటాడు .
10. కాటికాపరి పై తొమ్మిది మందినీ



పాతపెడతాడు.
11. రాజకీయ నాయకుడు, పై వారందరి మూలంగా
హాయిగా జీవిస్తాడు
__________________
*ఈ నాటికీ ఇవే వర్తిస్తున్నాయి , క్రీ।।పూ।। 43 నాటివి ! *